No products found
Recent searches
Clear all
Bestsellers
Jallikattu, C.S.Chellappa
Per piece
వాడివాసల్ (జల్లికట్టు) నవలకు తమిళ సాహిత్యంలో విశిష్టమైన స్థానం వుంది. ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు సి.ఎస్. చెల్లప్ప (1912 - 1998) ఈ నవలను 1949లో ఒక పత్రిక కోసం రాశారు. ఆతరువాత 1959లో పుస్తక రూపంలో ప్రచురించారు. అప్పుడు దీని ధర కేవలం ఒక్క రూపాయి! ఆయన అదే సంవత్సరం ఆధునిక, ప్రయోజనాత్మక సాహిత్యానికి వేదికగా 'ఎజుతు' అనే వినూత్న పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక చందాదారులకు వాడివాసల్ను ఉచితంగా అందించేవారు.
ఏడు దశాబ్దాలు గడచినా ఈ నవల ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతూ ఈ తరం పాఠకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
జల్లికట్టుపై తమిళంలో వెలువడిన తొలి నవల.. బహుశా ఏకైక నవల కూడా ఇదే. ప్రతి ఏటా మధురై, రామనాథపురం జిల్లాల్లో జల్లికట్టును నిర్వహిస్తుంటారు. ఆ క్రీడ గురించీ.. అందులో పాల్గొనే క్రీడాకారులు, నిర్వాహకులు, వారి మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధం, అధికార సంబంధాలు మొదలైనవాటి గురించీ ఈ నవలలో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా మనిషికీ-ఎద్దుకూ మధ్య జరిగే జీవన్మరణ పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రించారు.