No products found
Recent searches
Clear all
Bestsellers
Kulampai Lohia, Ram Manohar Lohia
Per piece
‘‘ఈ భూమి మీద ఉన్న అత్యంత విషాదగ్రస్తులు మన భారతీయులే.
భారతీయ జీవన విధానంలో కులం చాలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. సూత్రప్రాయంగా కులాన్ని తెగనాడేవాళ్ళు కూడా కులాన్ని ఆచరించడం ద్వారా ఆమోదిస్తారు’’
‘‘దేశంలో రాజకీయాలు, అది కాంగ్రెస్సా, కమ్యూనిష్టా, సోషలిస్టు పార్టీనా అన్న దానితో నిమిత్తం లేకుండా, ఒక ప్రధాన విషయంలో జాతీయంగానే ఒక ఒప్పందానికి కట్టుబడి నడుస్తున్నాయి. దేశ జనాభాలో నాలుగింట మూడు వంతులుగా ఉన్న శూద్రులు, మహిళలను ఒక పథకం ప్రకారమో, ఒక కట్టుబాటుగానో ఎన్నికలకు దూరం పెట్టి అట్టడుగు స్థాయిన అణిచిపెడుతున్నాయి!’
- రామ్ మనోహర్ లోహియా
1980వ దశకం నుండి కులం మీద వచ్చిన సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడం జీవిత లక్ష్యంగా పెట్టుకున్న నాకు కుల వ్యవస్థ మీద లోహియా రాసిన పుస్తకం దొరకడం నూతన అన్వేషణ అనే చెప్పాలి. సామాజికంగా బనియా కుల నేపధ్యం నుండి వచ్చిన ఈ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవించి, పోరాటం సాగించిన కాలానికే చెందినవాడు. కులం పట్ల లోహియా దృక్కోణం భిన్నమైనదే కానీ విముక్తి దృక్పధం.మహాత్మా ఫూలే, అంబేద్కర్‌ల వలే లోహియా కూడా దళితులు/శూద్రులు, మహిళల విముక్తి ఉద్యమాలను పరస్పర సంబంధం ఉన్న సాంస్కృతిక పోరాటాలుగా పరిగణించాడు. ఈ పుస్తకం చదివాక బనియా, బ్రాహ్మణ విచారధార ఉన్న వారిలో కూడా - కులతత్వానికి, పితృస్వామిక అడ్డుగోడలకి వ్యతిరేకంగా సాగే సమకాలీన పోరాటాల దళితులు, శూద్రులు, మహిళలు, మేధావులతో కలిసి పోరాడాలనే స్పృహ కలుగుతుంది.
- కంచ ఐలయ్య షెపర్డ్
లోహియా ఆలోచనలు, ఈ రోజుకి కూడా ఘంటాపథంగా, ఎంతో ప్రాసంగికతతో ప్రతిధ్వనిస్తాయి. వాటిని ఇరవై ఒకటవ శతాబ్దపు పాఠకుల కోసం వెలువరించడం ద్వారా...ఇంగ్లిషులో సౌత్ సైడ్ బుక్స్, తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌లు ఎంతో అమూల్యమైన సేవ చేస్తున్నాయి.
- రామచంద్ర గుహ