Home /   Categories /   Fiction  /   Sachi Routray Kathalu, Sachidananda Routray
  • Sachi Routray Kathalu, Sachidananda Routray
  • Sachi Routray Kathalu, Sachidananda Routray

Sachi Routray Kathalu, Sachidananda Routray

Per piece

Product details

 

ప్ర‌తి దేశంలోనూ బోలెడు నూతులూ, వాటిలో ఎన్నెన్నో క‌ప్ప‌లూ ఉంటాయి. వాటి "బెక‌బెక‌ల" హ‌డావుడి కూడా మ‌నం అనువ‌దించుకుంటూనే ఉన్నాం. ఇక స్వ‌దేశీ క‌ప్ప‌ల సంగతి చెప్ప‌న‌క్క‌ర లేదు. అందుకే ఉత్త‌మ సాహిత్యం బ‌హు కొద్దిగానూ, చెత్త సాహిత్యం కోకొల్ల‌లుగానూ మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతోంది. స‌చి రౌత్ రాయ్ ఉత్త‌మ సాహిత్య స్ర‌ష్ట‌! మొత్తం క‌థ‌ల‌న్నింటినీ ఒక్క ఊపున చ‌దివి ముగించాను.. ఇవి అంత‌ర్జాతీయ స్థాయిని అందుకోగ‌లిగిన క‌థ‌లు!

- శ్రీ. శ్రీ.

ఆధునిక ఒడియా సాహిత్యంలో అతిర‌థుల‌లోనే అతిర‌థుడు స‌చి రౌత్‌రాయ్‌! ఆయ‌న రాసిన‌వి ప‌ట్టుమ‌ని పాతిక క‌థ‌లే అయినా ప్ర‌తిదీ ప్ర‌తిభావంత‌మైన‌దే, ప్ర‌గ‌తి శీల‌మైన‌దే! 
- పురిపండా అప్ప‌ల‌స్వామి


చదువుతున్నంత సేపూ – "చూడు, చూడు..  కళ్ళు తెరిచి చూడు. అప్పుడే అణ‌చివేత అనేది మన సమాజంలో ఎంత భ‌యాన‌కంగా ఉందో తెలుస్తుంది నీకు!" అంటూ మ‌న‌ల్ని త‌ట్టి లేపుతుంటాయీ క‌థ‌లు. అక్ర‌మాలు, సామాజిక దుర‌న్యాయాల పట్ల పాఠకులు తిరుబాటు ప్ర‌క‌టించేలా చేసే ఈ క‌థాసంక‌ల‌నం.. చిన్నదే అయినా చాలా శక్తివంతమైనది. 


Similar products